వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విదేశీ యువతి పట్ల ట్రాఫిక్ దురుసు
హైదరాబాద్: హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు గురువారం ఒక విదేశీ మహిళ పట్ల దురుసుగా వ్యవహరించారు. తన మిత్రుడితో ద్విచక్రవాహనంపై వెళ్తున్న తన పట్ల, తన మిత్రుడిపట్ల ట్రాఫిక్ పోలీసులు దురుసుగా ప్రవర్తించారని మేరీ అనే విదేశీ యువతి ఆరోపించారు.
హెల్మెట్ లేదనే సాకుతో తమను ట్రాఫిక్ పోలీసులు పక్కకు పిలిచారని, తన మిత్రుడిని ఇన్స్పెక్టర్ కొట్టాడని ఆమె అంటోంది. అయితే అదంతా అబద్దమని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ అంటున్నారు. ఈ సంఘటనపై పూర్తిగా విచారణ జరిపిన తర్వాతనే చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు అంటున్నారు.
Comments
Story first published: Thursday, December 22, 2005, 23:53 [IST]