• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రైలులో బందిపోట్ల స్వైరవిహారం, ఒక స్త్రీ గ్యాంగ్‌రేప్‌

By Staff
|

భోపాల్‌: సాయుధ ముఠా ఒకటి ముంబాయి - లక్నో పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును దోచుకోవడమే కాకుండా ముగ్గురు ప్రయాణికులను రైలు నుంచి బయటకు నెట్టేసింది, ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడడంతో పాటు మరో మహిళను అపహరించుకుపోయింది. ఈ దారుణ సంఘటన భోపాల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో గల విదిషా వద్ద బుధవారం ఆర్థరాత్రి జరిగింది.

పది మంది దోపిడీదారుల్లో ఎనిమిది మంది కత్తులతో, ఇతర మారణాయుధాలతో స్వైరవిహారం చేస్తూ లూటీకి పాల్పడ్డారు. జనరల్‌ కంపార్ట్‌మెంట్‌లోని ప్రయాణికులను కొట్టారు. ఈ దోపిడీ ముఠా బోపాల్‌లో రైలులో ఎక్కినట్లు సమాచారం. ఎదుర్కోవడానికి ప్రయత్నించిన అఖిలేష్‌, అజయ్‌, సంజయ్‌ అనే ముగ్గుర్ని రైలు నుంచి కిందికి తోసేశారు. వారిని ఝాన్సీలోని ఆస్పత్రిలో చేర్చారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

ఒక మహిళను టాయ్‌లెట్‌లోకి లాక్కెళ్లి గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం చైన్‌ లాగి రైలు ఆపి దిగిపోయారు. వెళ్తూ వెళ్తూ ఒక మహిళను బలవంతంగా తమ వెంట తీసికెళ్లారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X