• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ద్రోణంరాజు ఆరోగ్యం విషమం: హైదరాబాద్‌కు తరలింపు

By Staff
|

విశాఖపట్నం: సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, శాసనసభ్యుడు ద్రోణంరాజు సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమిస్తోంది. దీంతో ఆయను విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఇటీవలే తన 73వ జన్మదినాన్ని జరుపుకున్న ద్రోణంరాజు సత్యనారాయణ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో విశాఖపట్నంలోని కేర్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

ఆరోగ్యం మరింత క్షీణించడంతో మెరుగైన వైద్య సేవల కోసం ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి ఆదేశాల మేరకు ద్రోణంరాజును దక్కన్‌ ఎయిర్‌వేస్‌ ప్రత్యేక విమానంలో విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. ఆయన వెంట మంత్రి కొణతాల రామకృష్ణ వున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X