వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిరసనల మధ్య వైయస్ పర్యటన
నిజామాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి నిజామాబాద్ జిల్లా పర్యటన నిరసన మధ్య సాగింది. ఆయన శుక్రవారంనాడు నిజామాబాద్ జిల్లాలో పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కరెంట్ బిల్లులపై బాల్కొండలో మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ సమస్యల పరిష్కారానికి నిరసన వ్యక్తం చేశారు.
మహిళల నిరసనతో ముఖ్యమంత్రి బాల్కొండ పర్యటనను ముగించుకుని వేల్పులకు బయలుదేరి వెళ్లారు. తెలంగాణ కోసం ఏర్పాటు చేసే విశ్వవిద్యాలయాన్ని నిజామాబాద్ జిల్లాలోనే ఏర్పాటుచ చేస్తామని ఆయన చెప్పారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులు తమ పరిహారం కోసం ఆందోళనకు దిగారు. నిర్వాసితులకు తగిన పరిహారం చెల్లిస్తామని యన చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!