• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అలీఘడ్‌కు మైనారిటీ హోదా చెల్లదు: హైకోర్టు

By Staff
|

అహ్మదాబాద్‌: అలీఘడ్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి మైనారిటీ హోదాపై కేంద్ర ప్రభుత్వానికి అలహాబాద్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ నుంచి చుక్కెదురైంది. అలీఘడ్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి మైనారిటీ హోదా ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని నిరుడు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును అలహాబాద్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ గురువారంనాడు సమర్థించింది.

నిరుడు అక్టోబర్‌ 4వ తేదీన హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయం దాఖలు చేసిన పిటిషన్‌పై ఛీఫ్‌ జస్టిస్‌ ఎ.యన్‌. రాయ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషన్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఆ మేరకు గురువారం తన నిర్ణయాన్ని వెల్లడించింది. నిరుడు పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరిన విద్యార్థులు యథావిధిగా తమ విద్యను కొనసాగించవచ్చునని తెలియజేసింది. రిజర్వేషన్లు వర్తింపజేయకుండా 2006-2007 అకడమిక్‌ సెషన్‌ పరీక్షలు పాత పద్ధతిలో జరపాలని కోర్టు ఆదేశించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X