వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెహ్మాన్‌ ఇంటిలో బెంగుళూర్‌ పోలీసుల సోదాలు

By Staff
|
Google Oneindia TeluguNews

నల్లగొండ/ చెన్నై: బెంగుళూర్‌లోని ఇండియన్‌ సైన్స్‌ సెంటర్‌పై దాడి కేసులో నిందితుడు, లష్కర్‌ - ఎ - తోయిబా నేత అబ్దుల్‌ రెహ్మాన్‌ ఇంటిలో బెంగుళూర్‌ పోలీసులు గురువారంనాడు సోదాలు నిర్వహించారు. నల్లగొండలోని రెహ్మాన్‌ ఇంటిని వారు క్షుణ్నంగా శోధించారు. ఈ సోదాల్లో పోలీసులకు ఒక సెల్‌ఫోన్‌, ఎంటియం కార్డు లభ్యమయ్యాయి. బుధవారంనాడు హైదరాబాద్‌ పోలీసులు కూడా రెహ్మాన్‌ ఇంటిలో సోదాలు నిర్వహించారు.

ఇదే కేసులో బెంగుళూర్‌ పోలీసులు చెన్నైలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటక పోలీసులు బషీర్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు చెన్నై నగర పోలీసు కమీషనర్‌ ఆర్‌. నటరాజన్‌ చెప్పారు. అతడ్ని బెంగుళూర్‌ తీసికెళ్లినట్లు సమాచారం. బషీర్‌ను గత రాత్రి ప్రశ్నించినట్లు కమీషనర్‌ తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X