• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విపక్షాలు, పత్రికలపై వైయస్‌ మండిపాటు

By Staff
|

హైదరాబాద్‌: ప్రతిపక్షాలపై, రెండు దినపత్రికలపై ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు పూర్తయితే తమ మనుగడ దెబ్బతింటుందనే భయంతో ప్రతిపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. తనను దించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని గద్దె ఎక్కించేందుకు ఈనాడు దినపత్రిక కంకణం కట్టుకుందని ఆయన అన్నారు. పోలవరంపై అఖిల పక్ష సమావేశం అనంతరం శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలపై ఆయన విరుచుకపడ్డారు.

సాగునీటి ప్రాజెక్టుల టెండర్లలో పాలకపక్షానికి వేయి కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయనే సిపియం కార్యదర్శి బి.వి. రాఘవులు ఆరోపణపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. ఎద్దు ఈనిందని రాఘవులు అంటే దూడను కట్టేయండి అని ఒక దినపత్రిక అన్నదని ఆయన వ్యాఖ్యానించారు. సాక్ష్యాధారాలు లేకుండా కోట్ల రూపాయల ముడపులు తీసుకున్నట్లు ఆరోపించడం ఏ విధమైన వ్యవహారమని ఆయన అడిగారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక్క ప్రాజెక్టును కూడా కట్టకున్నా అడగని పత్రికలు ప్రాజెక్టులు కట్టడానికి కృషి చేస్తున్న తమపై విమర్శలు చేస్తున్నాయని ఆయన అన్నారు.

పోలవరం, దుమ్ముగూడెం ప్రాజెక్టులు పూర్తయితే ఖమ్మం జిల్లాలో తమ పట్టు కోల్పోతామని సిపియం భయపడుతోందని, దాన్ని అర్థం చేసుకోవచ్చునని ఆయన వ్యంగ్యంగా అన్నారు. తనపై వ్యంగ్యంగా ఒక కార్టూన్‌ వేస్తూ దాని పక్కనే సిపియం ప్రకటనను ఒక పత్రిక ప్రచురించిందని అంటూ "రాజశేఖర్‌ రెడ్డి అనేవాడు పనికిమాలినవాడు, అర్జంట్‌గా అతడ్ని దించేసి చంద్రబాబును కూర్చోబెట్టాలని ఆ పత్రిక అనుకుంటుంది అని ఆయన అన్నారు.

తాము మొదలు పెట్టిన ప్రాజెక్టులను కాంగ్రెస్‌ పూర్తి చేస్తోందని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోందని, నిజానికి జంఝావతి ప్రాజెక్టు 1975లో జలగం వెంగళరావు ప్రభుత్వ హయాంలో ప్రారంభమైందని, అంతర్రాష్ట్ర వివాదం వల్ల ఆగిపోయిందని, 35 యేళ్ల తర్వాతనైనా ఫలితం దక్కాలని తాము పూర్తి చేస్తే తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై పాదయాత్ర చేస్తామని, ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం జాప్యం జరుగుతోందని విమర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్‌ గౌడ్‌పై ఆయన తీవ్రంగా విరుచుకపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వంలో దేవేందర్‌ గౌడ్‌ చక్రం తిప్పారని, అప్పుడు తెలంగాణ అనే పదం మాట్లాడడానికి కూడా దేవేందర్‌ గౌడ్‌ భయపడ్డారని, ఇప్పుడు ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. అసలు ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఆయన దేవేందర్‌ గౌడ్‌ను ప్రశ్నించారు.

అన్ని ఆమోదాలు లభించిన తర్వాతనే ప్రాజెక్టులు నిర్మించాలనే వాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. నిర్మాణం మొదలైన పదేళ్ల తర్వాత గానీ నాగార్జునసాగర్‌కు ఆమోదాలు రాలేదని, అలాగే తెలుగుగంగకు కూడా అని ఆయన అన్నారు. ప్రాజెక్టులను ఏదో విధంగా అడ్డుకోవాలనే ప్రయత్నంతో కోర్టులకు వెళ్తున్నారని, సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసిందని, అయినా ఊరుకోకుండా ప్రాంతీయ ఉద్యమాలు చేపట్టారని, దానికి స్పందన లభించకపోవడంతో ప్రాజెక్టులవారీ ఉద్యమాలంటున్నారని ఆయన తెలుగుదేశంపై విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇస్తున్న నష్టపరిహారాన్ని మేధాపాట్కర్‌ కూడా మెచ్చారని, ఏదో విధంగా గిరిజనులను రెచ్చగొట్టడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రతిపక్షాల చర్యల వల్ల పులిచింతల ఆరు మాసాలు ఆలస్యమైందని ఆయన అన్నారు.

మిగతా రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టులకు అన్ని పార్టీలు కలిసి పని చేస్తాయని, వారిని మన రాష్ట్ర ప్రతిపక్షాలు నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆయన అన్నారు. తాము తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించకపోయినా సరే, అడ్డంకులు కల్పించవద్దని ఆయన ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మేలు చేసే పనులకు ఆటంకాలు కల్పించవద్దని ఆయన కోరారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more