• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎన్నారైల పెట్టుబడుల కోసం సియంల పోటీ

By Staff
|

హైదరాబాద్‌: తమ తమ రాష్ట్రాల్లో ప్రవాస భారతీయుల పెట్టుబడులు పెట్టించేందుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ప్రవాస భారతీయుల పెట్టుబడులకు తమ తమ రాష్ట్రాలు అనువైనవని చెప్పుకోవడానికి ఆదివారం రెండో రోజు ప్రవాస భారతీయ దివస్‌లో ముఖ్యమంత్రులు పోటీ పడ్డారు. 11 మంది ముఖ్యమంత్రులు ఆదివారంనాడు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెంక్‌ సింగ్‌ ఆహ్లూవాలియాతో హైదరాబాద్‌లో సమావేశమై పెట్టుబడుల గురించి చర్చించారు.

పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులు పెట్టేందుకు తమ రాష్ట్రం అనువుగా ఉందని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ చెప్పారు. తమ రాష్ట్రంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని, పెట్టుబడులకు రాష్ట్రాన్ని అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అధికార మార్పిడి వల్ల ప్రజల్లో భరోసా ఏర్పడిందని, ఇప్పుడు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదనే విశ్వాసం పెరిగిందని ఆయన అన్నారు.

గుజరాత్‌ను చైనా, జపాన్‌ సరసన నిలబెడుతామని, గుజరాత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడి చెప్పుకున్నారు. ప్రైవేట్‌ రైళ్లు నడుస్తున్న రాష్ట్రం దేశంలో తమదొక్కటేనని ఆయన అన్నారు. తాము 41 ఓడరేవులను గుర్తించామని ఆయన చెప్పారు.

తమ రాష్ట్రం ప్రపంచంలోనే అందమైన ప్రదేశమని జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌ అన్నారు. తమ రాష్ట్రంలో పర్యాటక రంగం ఇతోధికంగా అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. పరిశ్రమలన్నీ జమ్మూలో కేంద్రీకృతమయ్యాయని ఆయన చెప్పారు. వ్యవసాయం, ఉద్యానవనం, ఫార్మా వంటి రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more