వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అభివృద్ధి చేసిన బాబు ఓటమి ఆశ్చర్యం: నితీష్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను ఎంతో అభివృద్ధి చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రవాస భారతీయ దివస్‌లో పాల్గొనడానికి వచ్చిన ఆయన సోమవారంనాడు చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు.
ఇరువురు నేతల మధ్య దాదాపు 30 నిమిషాల భేటీ జరిగింది. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీహార్‌లో వస్తున్న మార్పులను అందరూ అంచనా వేస్తున్నారని నితీష్‌కుమార్ అన్నారు. బీహార్ అభివృద్ధి చెందితే దేశమంతా అభివృద్ధి చెందినట్లేనని చంద్రబాబునాయుడు అన్నారు.
Comments
Story first published: Monday, January 9, 2006, 23:53 [IST]