దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
  • search

ఐటితో 6 వేల గ్రామాల అనుసంధానం: వైయస్‌

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    హైదరాబాద్‌: ఈ ఏడాది చివరికల్లా ఆరు వేల గ్రామాలను ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటి)తో అనుసంధానం చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. 2005-2010 ఐటి విధానం వల్ల రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి మరింత జరుగుతుందని ఆయన బుధవారం ఒక కార్యక్రమంలో అన్నారు. ఐటెక్స్‌లో జిటెక్స్‌ను ప్రారంభించారు. ఐటిలో బెంగుళూర్‌ను అధిగమించడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ఐటి విద్యార్థులు అన్ని దేశాల ఇంగ్లీషు భాష యాసలకు అలవాటు పడాలని ఆయన సూచించారు. పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వంతో 16 కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయని ఆయన చెప్పారు. ఐటి విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పెంపొందించకోవాలని సూచించారు.హార్డ్‌వేర్‌ పార్క్‌కు 1200 ఎకరాలు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు.

    మంత్రులు, తాను వేసిన పునాదిరాళ్లకు సంబంధించిన పనుల వివరాలను వెంటనే తెలియజేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా నిరుద్యోగ భృతి చెల్లించాల్సి వస్తే కలెక్టర్లే చూసుకోవాలని ఆయన ఆదేశించారు. అధికారులతో ఆయన బుధవారంనాడు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పనికి ఆహారం పథకం పనులను యంత్రాలతో చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పనికి ఆహారం పథకం కింద సిమెంట్‌ రోడ్లు, భవనాల నిర్మాణాలు చేపట్టకూడదని ఆయన ఆదేశించారు. ఏ పనినైనా అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీలో తనిఖీ చేయాలని ఆయన సూచించారు.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more