వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌ చేస్తే నేను రాజీనామా చేస్తా: దుగ్యాల

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌/ ఖమ్మం: తమ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్‌ రావు కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి పోటీ చేస్తే తాను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అసమ్మతి శాసనసభ్యుడు దుగ్యాల శ్రీనివాసరావు అన్నారు. దుగ్యాల శ్రీనివాస్‌ రావు తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని ఆదివారంనాటి పార్టీ సమావేశంలో తీర్మానం చేశారు. దీనిపై దుగ్యాల శ్రీనివాసరావు సోమవారం తీవ్రంగా ప్రతిస్పందించారు.

నిన్నటి దాకా తమ వైపు వున్న మందాడి సత్యనారాయణరెడ్డిని బతిమాలో, బుజ్జగించో కెసిఆర్‌ తన వైపు తిప్పుకున్నారని ఆయన అన్నారు. తాము సంధించిన 11 ప్రశ్నల్లో కీలకమైన అంశాలున్నాయని, ఇందులో రెండు అతి కీలకమైనవని, వాటికి కెసిఆర్‌ నుంచి సమాధానం రాలేదని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో రెండో ఎస్సార్సీకి అంగీకరిస్తూ తెరాస నేత ఎ. నరేంద్ర రాసిచ్చిన డాక్యుమెంట్‌ తన వద్ద ఉందని ఆయన అన్నారు.

మరో అసమ్మతి శాసనసభ్యురాలు శారారాణి కూడా కెసిఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కెసిఆర్‌ ఉద్యమాన్ని నీరు గార్చారని ఆమె ఖమ్మంలో ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X