వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెసిఆర్‌పై నోముల నర్సింహయ్య ధ్వజం
మెదక్: ఆరిపోయే ముందు దీపం వెలుగు విరజిమ్ముతుందని, అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర్ రావు మాటలు ఉన్నాయని సిపియం శాసనసభా పక్ష నాయకుడు నోముల నర్సింహయ్య అన్నారు. మెదక్‌లో ఆయన సింగూరు పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రశేఖర్ రావుపై తీవ్రంగా ధ్వజమెత్తారు.
తెలంగాణపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన నిర్ణయాన్ని తెలిపేవరకు ప్రభుత్వంలో కొనసాగుతామని చంద్రశేఖర్ రావు అనడాన్ని ఆయన అవహేళన చేశారు. తెలంగాణ ఇస్తా, రా అని సోనియా గాంధీ అంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. కమ్యూనిస్టులను వ్యతిరేకించినవాళ్లు చరిత్రలో మిగలకుండా పోయారని ఆయన అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!