వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కొత్త విప్లవ పార్టీకి ఏర్పాట్లు: సత్యమూర్తి
విజయవాడ: కొత్త విప్లవ పార్టీని స్థాపించనున్నట్లు సామాజిక విప్లవ వేదిక కన్వీనర్, ప్రముఖ కవి, మాజీ నక్సలైట్ నేత కె.జి. సత్యమూర్తి అలియాస్ శివసాగర్ ప్రకటించారు. పార్టీ సాయుధ పాంథాను అనుసరించాలా, ఎన్నికల పంథాను ఎంచుకోవాలా అనేది నిర్ణయం కాలేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఈ పార్టీ ఏర్పాటుకు మరో ఏడాది పడుతుందని ఆయన చెప్పారు. అప్పటి వరకు సామాజిక విప్లవ వేదిక పేరుతో పని చేస్తామని ఆయన చెప్పారు.
విప్లవ పార్టీ ఏర్పాటుకు సైద్ధాంతిక సన్నద్ధత జరుగుతోందని, అటువంటప్పుడు తాను పోలీసుల ఏజెంట్నని మావోయిస్టులు ఎలా ఆరోపిస్తారని ఆయన అన్నారు. మావోయిస్టులకు సిద్ధాంతం లేదని ఆయన విమర్శించారు. నేపాల్ వంటి దేశాల్లో మావోయిస్టులు విజయాలు సాధిస్తుండగా ఇక్కడి మావోయిస్టులు ఎందుకు సాధించడం లేదని ఆయన ప్రశ్నించారు.
Comments
Story first published: Wednesday, January 18, 2006, 23:53 [IST]