వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాకు డెడ్‌లైన్‌ పెట్టడానికి కెసిఆర్‌ ఎవరు?

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలంగాణపై డెడ్‌లైన్‌ విధించడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు ఎవరని రాష్ట్ర క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఎం. సత్యనారాయణ రావు ప్రశ్నించారు. తెలంగాణ అంశం సోనియా చేతిలోనే ఉందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.

తెలంగాణ ఏర్పాటుకు కమ్యూనిస్టులే అటంకంగా ఉన్నారని, కమ్యూనిస్టుల మద్దతు లేకుండా కేంద్రంలో కాంగ్రెస్‌ మనుగడ లేదని ఆయన చెప్పారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడదనే కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జి. వెంకటస్వామి వ్యాఖ్యను ఆయన సమర్థించారు. అనుభవపూర్వకంగానే వెంకటస్వామి తెలంగాణపై ఆ వ్యాఖ్యలు చేసి వుంటారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి తెలంగాణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలో నిజం లేదని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధిని వైయస్‌ నిర్లక్ష్యం చేస్తున్నారనేది తప్పుడు ప్రచారమని ఆయన అన్నారు.

తెలంగాణ అంశం ప్రస్తుతం సోనియా చేతుల్లో ఉందని, ఆమె తప్ప మరెవరూ తెలంగాణపై ఏమీ చెప్పలేరని ఆయన అన్నారు. అయితే సోనియా తప్ప మరెవరూ తెలంగాణ ఇవ్వలేరని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X