• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కెసిఆర్‌తో ఉమ భేటి: తెలంగాణకు మద్దతు

By Staff
|

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌కు తన పూర్తి మద్దతు ఉంటుందని మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) బహిష్కృత నేత ఉమా భారతి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్‌) నేత కె. చంద్రశేఖర్‌ రావుకు హామీ ఇచ్చారు. ఆమె శుక్రవారంనాడు చంద్రశేఖర్‌రావును, నరేంద్రను కెసిఆర్‌ నివాసంలో కలుసుకున్నారు. కెసిఆర్‌తో కలిసి ఆమె భోజనం చేశారు.

ప్రత్యేక రాష్ట్రంలోనే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని ఉమాభారతి అన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు రావాలని ఆమె కెసిఆర్‌కు సూచించారు. తాము బిజెపిలో ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాడామని, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఒత్తిడి వల్ల వెనక్కి తగ్గామని ఆమె అన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనేది ప్రజల డిమాండ్‌ అని, దీన్ని నిర్లక్ష్యం చేయలేరని కె. చంద్రశేఖర్‌ రావు అన్నారు. నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం బద్దలవుతుందని ఆయన అన్నారు.

టిఆర్‌యస్‌ అంటే ఏమిటి, టి ఆర్‌యస్‌ ఎజెండా ఏమిటి వంటి వివరాలను ఆమె కెసిఆర్‌ను అడిగి తెలుసుకున్నారు. కెసిఆర్‌, నరేంద్రలు మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారనే విషయాన్ని కూడా ఆమె అడిగి తెలుసుకున్నారు. ఆమె ఇదివరకే తెలంగాణకు తన మద్దతును ప్రకటించారు. తెలంగాణను కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ మోసం చేశారని ఆమె విమర్శించారు. అందుకు సోనియా యుపిఎ చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేయాలని కూడా ఆమె డిమాండ్‌ చేశారు.

ఆమె శుక్రవారంనాడు కరీంనగర్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. రేపు (శనివారం) వరంగల్‌లో చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతుగా జరిగే సదస్సులో పాల్గొంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X