వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ ప్లీనరీని ప్రారంభించిన సోనియాగాంధీ
హౖౖెదరాబాద్: కాంగ్రెస్ ప్లీనరీకి హాజరుకావడానికి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో వారికి ముఖ్యమంత్రి వైఎస్, పిసిసి అధ్యక్షుడు కె కెశవరావు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అత్యంత కట్టుదిట్ట మైన భద్రతా ఏర్పాట్ల నడుమ 60 కార్ల భారీ కాన్వాయ్‌తో సోనియా, ప్రధాని ప్లీనరీ వేదికైన గచ్చిబౌలి స్టేడియంకు చేరుకున్నారు. మార్గమధ్యంలో నానక్ నగర్లో ప్లీనరీ సందర్భంగా ప్రత్యేకంగా నిర్మించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సోనియా ప్రారంభించడంతో ప్లీనరీ కార్యక్రమాలలో మొదటి ఘట్టం ప్రారంభమైంది. ప్లీనరీకి తరలి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో నగరం కళకళలాడుతోంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!