• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రెండో ఇన్నింగ్స్‌: అక్మల్‌, యూనిస్‌ అర్థసెంచరీలు

By Staff
|

ఫైసలాబాద్‌: పాకిస్థాన్‌ భారత్‌పై తన రెండో ఇన్నింగ్స్‌లో ధాటిగా బ్యాటింగ్‌ చేస్తోంది. మంగళవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ నష్టానికి 152 పరుగులు వేసింది. ఓపెనర్‌ సల్మాన్‌ భట్‌ 24 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద కుంబ్లే బౌలింగ్‌లో టెండూల్కర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరం కమ్రాన్‌ అక్మల్‌తో కలిసిన యూనిస్‌ ఖాన్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ అర్థసెంచరీలు చేసి క్రీజ్‌లో ఉన్నారు యూనిస్‌ఖాన్‌ 64 పరుగులతో, అక్మల్‌ 59 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. దీంతో పాకిస్థాన్‌ భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌పై 137 పరుగుల ఆధిక్యత సాధించింది. ఆటకు మరో రోజు ఉంది.

అంతకు ముందు భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 803 పరుగులు చేసింది. పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌పై భారత్‌ 15 పరుగుల స్వల్ప ఆధిక్యతను సాధించింది. సోమవారం పాకిస్థాన్‌ బౌలర్లపై విరుచుకుపడ్డ ధోనీ 148 పరుగులకు, ఇర్ఫాన్‌ పఠాన్‌ 90 పరుగులకు అవుటయ్యారు. హర్బజన్‌ సింగ్‌ 38 పరుగులు చేశాడు. టెయిల్‌ ఎండర్ల బ్యాటింగ్‌తో భారత్‌ పాకిస్థాన్‌పై ఆధిక్యత సాధించింది. కనేరియా మూడు వికెట్లు తీసుకోగా, ఆఫ్రిది రెండు వికెట్లు తీసుకున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X