• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్‌తో కెసిఆర్‌, నరేంద్ర కమ్మక్కు

By Staff
|

హైదరాబాద్‌: పదవులను కాపాడుకోవడానికి తమ పార్టీ అగ్రనేతలు కె. చంద్రశేఖర్‌ రావు, ఎ. నరేంద్ర కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని పార్టీ అసమ్మతి శాసనసభ్యులు తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి, దుగ్యాల శ్రీనివాసరావు విమర్శించారు. తెలంగాణపై రక్షణ మంత్రి, యుపిఎ సబ్‌ కమిటీ చైర్మన్‌ ప్రణబ్‌ ముఖర్జీ తేటతెల్లం చేసిన తర్వాత నిమ్మకు నీరెత్తినట్లున్నారంటే తమ నేతల ఉద్దేశం బయటపడుతోందని వారు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం సాధ్యం కాదని ప్రణబ్‌ ముఖర్జీ స్పష్టంగా చెప్పారని, ఈ స్థితిలో కెసిఆర్‌, నరేంద్రలు తెలంగాణ ప్రజలను మభ్య పెట్టలేరని వారన్నారు. కెసిఆర్‌వి ఊకదంపుడు మాటలని, మాటల గారడీలని ప్రణబ్‌ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందని వారన్నారు. కెసిఆర్‌ డెడ్‌లైన్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా ప్రణబ్‌ చెప్పారని వారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X