• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గోదావరి నీటిలో తెలంగాణకు అన్యాయం: టిడిపి

By Staff
|

హైదరాబాద్‌: గోదావరి జలాల్లో తెలంగాణ వాటాపై రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్‌ గౌడ్‌ విమర్శించారు. గోదావరి జలసాధన పాదయాత్రను ప్రారంభించడానికి ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లికి ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ బృందం బయలుదేరింది. ఈ సందర్భంగా కరీంనగర్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి దేవేందర్‌ గౌడ్‌ పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం శుక్రవారం కొద్దిసేపు ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

దేవాదుల, ఎల్లంపల్లి వరద కాలువ ప్రాజెక్టులు తమ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు. గోదావరి జలాలను తెలంగాణకు అందించే విషయంలో ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X