• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేంద్రమంత్రి వర్గంలోకి నేదురుమల్లి, విహెచ్‌?

By Staff
|

న్యూఢిల్లీ: ఆదివారం కేంద్ర మంత్రి వర్గాన్ని విస్తరించడానికి రంగం సిద్దమైంది. విస్తరణ విషయమై ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యూపి ఏ చైర్మన్‌ సోనియా గాంధీతో శనివారం నాలుగు గంటలపాటు చర్చించారు. ఈ సమావేశంలో కొత్తగా మంత్రిపదవులు లభించేవారి జాబితాకు తుది రూపునిచ్చినట్టు తెలుస్తోంది. మన రాష్ట్రం నుంచి నేదురుమల్లి జనార్ధనరెడ్డి, వి.హనుమంతరావులకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం లభించవచ్చు. రాష్ట్రానికి చెందిన ఒకరిద్దరు కేంద్రమంత్రులకు ఉద్వాసన పలకవచ్చు. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు కరణ్‌ సింగ్‌కు విదేశాంగ శాఖ లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిసింది. వాయలార్‌ రవి, ఆనంద్‌ శర్మ, మోతిలాల్‌ ఓరా, శిబు సోరెన్‌, తదితరులకు మంత్రి వర్గంలో స్థానం లభించవచ్చని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి నేదురుమల్లి జనార్థన రెడ్డి, వి హనుమంతరావులకు పదవులు దక్కవచ్చని ఢిల్లీలోని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X