• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బిజెపి ఔనంటే వెంటనే తెలంగాణ బిల్లు

By Staff
|

వరంగల్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ సుముఖంగా ఉంటే ఆ బిల్లును కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం ముందుకు తెచ్చే అవకాశముందని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభాపక్ష నేత విజయరామారావు శనివారం ఇక్కడ చెప్పారు. బిజెపి సహకారం కోసం చంద్రశేఖరరావు సంప్రదింపులు జరపడంపై ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సమితికి భారతీయ జనతా పార్టీ సహకరించే అవకాశం రావడం హర్షణీయమని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి అన్నారు. టిఆర్‌ఎస్‌ అసమ్మతి ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు మాత్రం దీనిని ఒక ఫార్సుగా కొట్టిపడేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై బిజెపికి ఉన్న స్పష్టత టిఆర్‌ఎస్‌కు లేదని ఆయన వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X