దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
  • search

పురంధరేశ్వరికి మానవ వనరులు, పల్లంరాజుకు రక్షణ

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    న్యూఢిల్లీ: రాష్ట్రం నుంచి మంత్రివర్గంలో చోటు దక్కిన ముగ్గురు సహాయ మంత్రుల్లో దగ్గుబాటి పురంధరేశ్వరికి మావన వనరుల అభివృద్ధి శాఖను, పల్లంరాజుకు రక్షణ శాఖను కేటాయించారు. టి. సుబ్బరామిరెడ్డి ప్రస్తుతానికి శాఖ లేని మంత్రిగా ఉంటారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రేణుకా చౌదరి శాఖను మార్చారు. ఆమెకు మహిళా శిశు సంక్షేమ శాఖను అప్పగించారు.

    విదేశాంగ శాఖను ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తన వద్దే ఉంచుకున్నారు. శిబూ సొరేన్‌కు బొగ్గు గనుల శాఖ దక్కింది. సుశీల్‌కుమార్‌ షిండేకు ఇంధన శాఖను, ఆంతూలేకు మైనారిటీ వ్యవహారాల శాఖను, మణిశంకర్‌ అయ్యర్‌ శాఖను మార్చి ఆయనకు క్రీడలు, యువజన సర్వీసుల శాఖను అప్పగించారు. మణిశంకర్‌ అయ్యర్‌ నిర్వహిస్తున్న పెట్రోలియం శాఖను దెవరాకు అప్పగించారు. వాయలార్‌ రవి ఓవర్సీస్‌ ఇండియన్‌ అఫైర్స్‌ శాఖను అప్పగించారు. అంబికా సోనీకి పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖను అప్పగించారు.

    సైఫుద్దీన్‌ సోజ్‌కు జలనవరుల శాఖను, సంతోష్‌ మోహన్‌ దేవ్‌కు భారీ పరిశ్రమల శాఖను అప్పగించారు. జి.కె. వాసన్‌ స్టాటిస్టిటిక్స్‌, ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ శాఖను స్వతంత్రంగా నిర్వహిస్తారు. పహాయ మంత్రి ఆనంద శర్మ విదేశాంగ శాఖను నిర్వహిస్తారు.

    కొత్త సహాయ మంత్రులు, శాఖలు: పవన్‌ కుమార్‌ బన్సాల్‌ ( ఆర్థిక శాఖ), ఆనందశర్మ (విదేశీ వ్యవహారాలు), అజమ్‌ మేకన్‌ ( పట్టణాభివృద్ధి), ఎం. ఎం. పల్లంరాజు (రక్షణ), చంద్రశేఖర్‌ సాహు (కార్మికశాఖ), అఖిలేష్‌ దాస్‌ ( ఉక్కు), అశ్వినీకుమార్‌ (పరిశ్రమలు), డి. పురంధరేశ్వరి (హెచ్‌ ఆర్‌డి), ఇ.వి.కె. యస్‌. ఎలంగోవన్‌ (టెక్స్‌టైల్స్‌), రావు ఇంద్రజిత్‌ సింగ్‌ (రక్షణ), కాంతి సింగ్‌ (భారీ పరిశ్రమలు), బి.కె. హండిక్‌ (రసాయనాలు, ఎరువులు, పార్లమెంటరీ వ్యవమారాలు). దిన్‌షా పటేల్‌, టి. సుబ్బరామిరెడ్డి, జైరామ్‌ రమేష్‌లకు శాఖలు అప్పగించలేదు. ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ కూడా శాఖ లేని మంత్రిగా కొనసాగుతారు.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more