వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్‌ను అదుకున్న అక్మల్: కష్టాల్లో భారత్
కరాచీ: పాకిస్థాన్‌తో కరాచీలో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ మెడలోతు కష్టాల్లో పడింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ద్రావిడ్ 3 పరుగులకే అవుట్ కాగా, అతనితో పాటు ఓపెనర్‌గా దిగిన వివియస్ లక్ష్మణ్ అసిఫ్ వేసిన అద్బుతమైన బంతికి 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. సెహ్వాగ్ ఐదు పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు. సచిన్ టెండూల్కర్ మరోసారి నిరాశపరిచాడు. 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రజాక్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అక్తర్, రజాక్‌లకు ఒకటేసి వికెట్ లభించగా, ఆసిఫ్‌కు రెండు వికెట్లు దక్కాయి.
అంతకు ముందు పాకిస్థాన్ తన తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలవుట్ అయింది. పరుగులేమీ చేయకుండానే మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ తీవ్రమైన కష్టాల్లో పడింది. అక్మల్, రజాక్, అక్తర్‌లు పాకిస్థాన్‌ను ఆదుకున్నారు. పాకిస్థాన్ ఆ మాత్రం పరుగులు చేయడానికి వారు దోహద పడ్డారు. మొదటి ఓవర్లోనే ఇర్ఫాన్ పఠాన్ సున్నా పరుగులకే ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేశాడు. పఠాన్ హ్యాట్రిక్ సాధించాడు. దీంతో హ్యాట్రిక్ సాధించిన రెండో భారత బౌలర్‌గా రికార్డు సాధించాడు. అక్మల్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభను కనబరిచి 113 పరుగులు చేశాడు. అక్తర్ 45 పరుగులు చేశాడు. ఆర్పి సింగ్‌కు మూడు, జహీర్‌ఖాన్‌కు మూడు వికెట్లు లభించాయి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!