వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సలైట్ల అణిచివేతకు భారీ వ్యూహం: జానారెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో పెచ్చురిల్లుతున్న నక్సల్స్‌ కార్యకలాపాలను అడ్డ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ వ్యూహాన్ని రూపొందించనుందని హోం శాఖ మంత్రి కె జానారెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన జిల్లా కలెక్టర్ల, ఎస్పీల సమావేశంలో నక్సల్స్‌ను అదుపుచేసేందుకు గ్రేహాండ్స్‌ దళాలను పెంచాలని నిర్ణయించామని ఆయన తెలియజేశారు. దీనికి అనుగుణంగానే రాయలసీమ, విశాఖలలో కొత్తగా గ్రేహాండ్స్‌ యూనిట్లను ప్రారంభించడానికి ముఖ్యమంత్రి అంగీకరించారని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవస్థీకృత నేరాల చట్టాన్ని మళ్లీ అమలులోకి తీసుకురానున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X