• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పురంధరేశ్వరి ప్రకటన హాస్యాస్పదం: టిడిపి

By Staff
|

గుంటూరు/ నెల్లూరు: కాంగ్రెస్‌లో ఉంటూ ఎన్టీ ఆర్‌ ఆశయాలను సాధిస్తానని కేంద్ర మంత్రి, ఎన్టీఆర్‌ కూతురు దగ్గుబాటు పురంధరేశ్వరి అనడం హాస్యాస్పదమని తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి గురువారం నెల్లూరులో అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుల అవినీతి బోఫోర్స్‌ కుంభకోణాన్ని మించిపోయిందని ఆయన అన్నారు.

తమ నాయకుడు నారా చంద్రబాబునాయుడును విమర్శించడానికే పురంధరేశ్వరి కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చారని తెలుగుదేశం నాయకుడు డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఎన్టీ ఆర్‌ స్ఫూర్తి ప్రదాత అని తమ నాయకుడు చంద్రబాబు అన్నారని, ఈ సందర్భంలో కాంగ్రెస్‌ నాయకులు చౌకబారు ప్రకటనలు చేయడం తగదని ఆయన గురువారంనాడు గుంటూరులో అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X