• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణపై మన్మోహన్‌ ప్రభుత్వం మోసం: బిజెపి

By Staff
|

హైదరాబాద్‌: ఏకాభిప్రాయ సాధన పేరు చెప్పి తెలంగాణపై మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు ఎన్‌. ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. తెలంగాణను ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక (సియంపి)లో చేర్చి 20 నెలలు గడుస్తున్నా ఏ విధమైన చర్యలు తీసుకోలేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తప్పు పట్టారు.

శాసననమండలి పునరుద్ధరణ బిల్లును ఆమోదింపజేసుకున్న కాంగ్రెస్‌ తెలంగాణ ఏర్పాటు విషయంతో మాత్రం ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని, ఇది ఎన్నికల హామీని విస్మరించడమేనని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని చిన్న రాష్ట్రాలుగా విభజించాలని తాము కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఎన్ని రాష్ట్రాలుగా విభజించాలనే విషయంపై ఆయన సమాధానం దాటవేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X