• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వరంగల్‌లో ఏడుగురు నక్సల్స్‌ లొంగుబాటు

By Staff
|

వరంగల్‌: వరంగల్‌ రేంజి డిఐజి బి.యల్‌. మీనా ముందు శుక్రవారంనాడు ఏడుగురు నక్సల్స్‌ లొంగిపోయారు. లొంగిపోయిన నక్సలైట్లలో ముగ్గురు మావోయిస్టులు ఉన్నట్లు మీనా మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ నెల 15వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జరిగే మేడారం జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మావోయిస్టులు దాడులు చేయవచ్చుననే అనుమానంతో మేడారం జాతరకు హైటెక్‌ భద్రతను కల్పిస్తున్నారు.

మేడారం జాతర సందర్భంగా ఏరియల్‌ సర్వే నిర్వహిస్తామని, కెమెరాలను అమరుస్తామని మీనా చెప్పారు. భద్రత కోసం పది వేల మంది పోలీసులను, వేయి మంది హోంగార్డులను నియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. 22 పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X