వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఇప్పట్లో అసాధ్యం: ఎమ్మెస్సార్‌

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇప్పట్లో సాధ్యం కాదని రాష్ట్ర క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఎం. సత్యనారాయణ రావు అన్నారు. నిరుడు డిసెంబర్‌ 28 తేదీలోగా 610 జీవో అమలు చేయకపోతే తాను రాజీనామా చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు ఎ. నరేంద్ర చెప్పడంపై ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు.

డిసెంబర్‌ 28వ తేదీ లోగా నివేదిక సమర్పిస్తామని 610 జీవో అమలుపై ఏర్పాటయిన సబ్‌ కమిటీ చైర్మన్‌గా తాను చెప్పానని ఆయన గుర్తు చేశారు. 610 జీవో అమలు చేయకపోతే తాను రాజీనామా చేస్తానని అనలేదని ఆయన వివరణ ఇచ్చారు. తాను అమలు చేస్తే అని అనలేదని ఆయన అన్నారు. తాను గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని, మూడు సార్లు జైలుకు వెళ్లానని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X