వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేం క్రీడాస్ఫూర్తితోనే వ్యవహరించాం: ద్రావిడ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

రావల్పిండి: భారత్‌ జట్టు సభ్యులు తన అవుట్‌కు అప్పీల్‌ చేసి క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారనే పాకిస్థాన్‌ జట్టు కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ విమర్శను భారత జట్టు కెప్టెన్‌ రాహుల్‌ ద్రావిడ్‌ ఖండించారు. తమ జట్టు క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించి వుంటే మ్యాచ్‌ అధికారులు చర్య తీసుకుని ఉండేవారు కదా అని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

తన, అంపైర్ల, మ్యాచ్‌ రెఫరీ అభిప్రాయాల ప్రకారం భారత జట్టు క్రీడా నిబంధనలకు, క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించలేదని ఆయన అన్నారు. తమ జట్టు క్రీడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి వుంటే అంపైర్లు, మ్యాచ్‌ రెఫరీ చర్యలు తీసుకుని వుండేవారని ఆయన అన్నారు. ఈ వివాదాన్ని తాము సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని పోవచ్చునని, అయితే సిరీస్‌ ప్రాముఖ్యాన్ని, సందర్భాన్ని, సామంజస్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంతటితో ముగించాలని అనుకుంటున్నామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X