వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తగిన వేళ తెరాసతో స్నేహం: దత్తాత్రేయ
హైదరాబాద్: సమయం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో తాము పొత్తు కుదుర్చుకుంటామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. తెరాసతో పొత్తును కొట్టి పారేయలేమని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలంగాణపై తాము అనుకూల వైఖరి తీసుకున్నందున తెరాసతో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేకపోలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ విధానాలకు మద్దతు పలుకుతూ ఎంత కాలం ఉంటారనేది తెరాస నాయకులు తేల్చుకోవాల్సి వుందని ఆయన అన్నారు. తెలంగాన సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రచారం చేస్తున్నదే తప్ప పనులు జరగడం లేదని ఆయన విమర్శించారు.
Comments
Story first published: Friday, February 10, 2006, 23:53 [IST]