వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తగ్గని గాయం: రెండో వన్డేకూ అక్తర్ దూరం
రావల్పిండి: భారత్తో శనివారం రావల్పిండిలో జరిగే రెండో వన్డే మ్యాచ్కు కూడా పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ దూరంగా ఉంటున్నాడు. మోకాలి నొప్పి కారణంగా అక్తర్ తొలి వన్డేలోనూ అడలేకపోయాడు. అయితే నొప్పి తగ్గకపోవడంతో రెండో వన్డేలో కూడా అక్తర్ ఆడడం లేదని పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ చెప్పాడు.
లాహోర్లో జరిగే మూడో వన్డే నాటికి అక్తర్ కోలుకోగలడని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రవేశపెట్టిన రోటేషన్ పాలసీ వల్లనే అక్తర్ తొలి వన్డేలో ఆడలేకపోయాడని పాకిస్థాన్ టీమ్ మేనేజ్మెంట్ ఇంతకు ముందు ప్రకటించింది. భారత స్పిన్నర్ హర్బజన్ సింగ్ కూడా రెండో వన్డేలో ఆడే పరిస్థితి లేదు.
Comments
Story first published: Friday, February 10, 2006, 23:53 [IST]