వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్, కెసిఆర్, నరేంద్రలవి కపట నాటకాలు: టిడిపి
మెదక్: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు కె. చంద్రశేఖర్ రావు, ఎ. నరేంద్ర కపట నాటకాలు ఆడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టిన గోదావరి జల సాధన పాదయాత్ర శుక్రవారంనాడు మెదక్ జిల్లాకు చేరుకుంది. కాలు అడ్డం పెడితే గోదావరి జలాలు వస్తాయని చెప్పిన చంద్రశేఖర్ రావే కాలు విరగ్గొట్టుకున్నారని ఆయన అన్నారు.
కేంద్రంలో మంత్రి పదవుల్లో కొనసాగుతూ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిని ఎదుర్కునే దమ్ము కెసిఆర్, నరేంద్రలకు ఉందా ఆయన అడిగారు. తెరాస నాయకుల తన్నుకు చస్తున్నారని ఆయన అన్నారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల పేరుతో కాంగ్రెస్ రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేస్తోందని ఆయన విమర్శించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!