వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విరాళాల కోసం గజల్‌ శ్రీనివాస్‌ కచేరి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గజల్‌ గీతాలతో సుప్రసిద్దులైన గజల్‌ శ్రీనివాస్‌ తన గానామృతాన్ని సూర్యాపేట వాసులకు పంచనున్నారు. ఫిబ్రవరి 12న నల్గొండ జిల్లా సూర్యాపేటలో గజల్‌ శ్రీనివాస్‌ సంగీత కార్యక్రమం జరుగుతుంది. అమెరికాలోని ప్రవాసాంధ్ర సంస్థ స్ప్రెడ్‌ ఇండియా, గజల్‌ చారిటబుల్‌ ట్రస్టుల ఆధ్వర్వంలో ఈ కార్యక్రమం జరగనున్నది. నల్గొండ జిల్లాలోని గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలకు ఫర్నిచర్‌ను సమకూర్చలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సూర్యాపేటలో స్ప్రెడ్‌ ఇండియా నిర్వాహాకుడు రమేష్‌ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఎంతో తోడ్పాటునందించదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X