వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ బిల్లు పెడితే బలపరుస్తాం: బిజెపి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే తాము మద్దతిస్తామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి చెన్నమనేని విద్యాసాగర రావు చెప్పారు. బిల్లు ప్రవేశపెడితే బిజెపి మద్దతు తెలపడం వల్ల గందర గోళం ఏర్పడుతుందని కాంగ్రెస్ భయపడుతోందని ఆయన సోమవారం ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానల్ ప్రతినిధితో అన్నారు.
బిల్లు ప్రవేశపెట్టడం వల్ల ఏర్పడే గందరగోళం నుంచి బయటపడడానికే కాంగ్రెస్ తమపై నిందలు మోపుతోందని ఆయన అన్నారు. అందుకే కాంగ్రెస్ తెలంగాణపై డొంకతిరుగుడుగా వ్యవహరిస్తూ బిజెపి అభిప్రాయం చెప్పడం లేదని అంటోందని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత రాష్ట్రంలో బలపడడానికి బిజెపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనకు సమాంతరంగా ఇటు తెలంగాణలోనూ అటు కోస్తాంధ్రలోనూ ఉద్యమాలు నడపడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!