వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు ఒత్తిడి: చిన్నారెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించాలని తాము తమ పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తామని తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్‌ సమన్వయ కమిటీ (టిఆర్‌సిసిసి) కన్వీనర్‌ జి. చిన్నారెడ్డి చెప్పారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) మద్దతు ఇస్తామని ఇస్తామని ప్రకటించినందున పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలని తమ పార్టీ నాయకత్వాన్ని కోరుతామని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.

సిపియం మద్దతు ఇవ్వకపోయినా ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి పునరుద్ధరణ బిల్లు బిజెపి సహకారంతో పార్లమెంటు ఆమోదం పొందిందని, అదే రీతిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు బిల్లు ఆమోదం పొందే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. పార్లమెంటులో ప్రతిపాదిస్తే తెలంగాణ బిల్లుకు మద్దతు తెలియజేస్తామని బిజెపి ప్రకటించడం మంచి పరిణామమని ఆయన అన్నారు. పార్టీలో తన ఉనికి కోసమే తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్‌ గౌడ్‌ పాదయాత్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X