వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోమాలో ఆర్తి అగర్వాల్‌ : తలకు గాయం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటి ఆర్తి అగర్వాల్‌ తలకు తీవ్రంగా గాయమైంది. దీంతో ఆమెను అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెను పరీక్షించి, శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఆమెను ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసియు)లోకి తరలించారు. ఆమె కోమాలో ఉన్నట్లు, వెంటలేటర్‌ ద్వారా శ్వాస అందిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. ఆర్తి అగర్వాల్‌ తలలో రక్తం గడ్డ కట్టినట్లు సమాచారం.

ఇంటిపై నుంచి జారిపడడం వల్ల ఆర్తి అగర్వాల్‌ తల గాయమైనట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం పన్నెండు, పన్నెండున్నర గంటల ప్రాంతంలో ఆమెను ఆపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అంతకు పావు గంట ముందే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి ఫోన్‌ చేసి ఆర్తి అగర్వాల్‌ పరిస్థితి గురించి వివరించారు.

ఆర్తి అగర్వాల్‌ బుధవారం రాత్రి డూప్లెక్స్‌ హౌస్‌ పై అంతస్థు నుంచి పడినట్లు సమాచారం. అయితే ఆమె తల్లిదండ్రులు సీరియస్‌గా తీసుకోలేదు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్చారు. రాత్రి ప్రమాదం లేదని భావించినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్తి అగర్వాల్‌ ఆరోగ్య పరిస్థితిపై సినీవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్తి అగర్వాల్‌ ప్రస్తుతం సునీల్‌ హీరోగా నటిస్తున్న అందాల రాముడు సినిమాల్లో నటిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X