• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆర్తి మెట్ల మీంచి జారిపడింది: తండ్రి శశాంక్‌

By Staff
|

హైదరాబాద్‌: సినీనటి, తమ కూతురు ఆర్తి అగర్వాల్‌ నిన్న రాత్రి (బుధవారం) రాత్రి మెట్ల మీంచి జారిపడిందని ఆమె తండ్రి శశాంక్‌ అగర్వాల్‌ చెప్పారు. మెట్ల మీంచి జారిపడినప్పుడు వెంటనే స్పృహ కోల్పోలేదని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. ప్రమాదం లేదని అనుకున్నామని ఆయన చెప్పారు.

నొప్పి అని చెప్పి ఆర్తి అగర్వాల్‌ పెయిన్‌ కిల్లర్‌ వేసుకుందని ఆయన చెప్పారు. ఆస్పత్రికి వచ్చే వరకు ఆమె స్పృహలోనే ఉందని ఆయన చెప్పారు. ఇవాళ్ల (గురువారం) ఉదయం మెదడు భాగంలో నొప్పి అని చెప్పడంతో ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించామని ఆయన చెప్పారు. డాక్టర్‌ సలహా మేరకు ఆస్పత్రికి తీసుకొచ్చామని ఆయన చెప్పారు. నిన్న రాత్రి ఇంటిలో ఏ విధమైన పార్టీ జరగలేదని ఆయన చెప్పారు.

ఆర్తి అగర్వాల్‌ గతంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రేమ విఫలం కావడంతో ఆమె ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే డిప్రెషన్‌ వల్లనే తాను ఆ పనికి ఒడిగట్టానని ఆమె ఆ తర్వాత ప్రకటించింది. అప్పటి నుంచే ఆమెకు సినిమాల్లో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఆమె వెంకటేష్‌ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్‌ సినిమాతో తెలుగు సినిమా రంగంలో ప్రవేశించింది. తెలుగు అగ్ర హీరోలందరి సరసన ఆమె హీరోయిన్‌గా నటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X