• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొల్లేరు లీజుదారుల అరెస్టులకు రంగం సిద్ధం

By Staff
|

విజయవాడ: కొల్లేరులో చేపల చెరువులను ఖాళీ చేయడానికి నిరాకరించిన లీజుదారుల, ఆక్రమణదారుల అరెస్టుకు రంగం సిద్ధమైంది. పోలీసులు పెద్ద యెత్తున రంగంలోకి దిగింది. చేపల చెరువుల ధ్వంసాన్ని ఈ సాయంత్రం నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో కలెక్టర్‌ కైకలూరులో చేపల చెరువుల యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆంజనేయులు అనే లీజుదారు ఖాళీ చేయడానికి నిరాకరించాడు. దీంతో ఆంజనేయులు అరెస్టుకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తాం గానీ చేపల చెరువులను ధ్వంసం చేయనివ్వబోమ కోల్లేరు ప్రాంతవాసులు అంటున్నారు. చేపల చెరువుల ధ్వంసానికి తాము పూనుకోకపోతే తమ మీద కూడా కోర్టు ధిక్కరణ కింద కేసు పెడతారని కలెక్టర్‌ అన్నారు. అయితే కొల్లేరులో చేపల చెరువులను ధ్వంసం చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. చేపల చెరువుల ఆక్రమణదారులకు సహకరిస్తే అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు పెట్టాలని హైకోర్టు ఆదేశించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X