• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గిర్‌గ్లానీ నివేదికపై కాంగ్రెస్‌లో చిచ్చు

By Staff
|

హైదరాబాద్‌: గిర్‌గ్లానీ కమిటీ నివేదికను యధాతథంగా అమలు చేయాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్‌లోని కోస్తా, తెలంగాణ నాయకుల మధ్య వివాదాన్ని సృష్టించే అవకాశాలున్నాయి. తెలంగాణలోని స్థానికులకు ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాన్ని సరిచేసే 610 జీవోను అమలు చేయడంతో పాటు హైదరాబాద్‌ను ఆరవ జోన్‌ కిందికి తేవడాన్ని కోస్తా శాసనసభ్యులు వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటించాలని మండలి బుద్ధప్రసాద్‌ వంటి కోస్తా కాంగ్రెస్‌ శాసనసభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. 610 జీవో అమలుకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఉద్యమిస్తే మద్దతు తెలియజేస్తామని కూడా ఆయన ప్రకటించారు.

కోస్తా శాసనసభ్యుల తీరుపై తెలంగాణ శాసనసభ్యులు మండిపడుతున్నారు. తాము ఇంత కాలం మాట్లాడకుండా ఉండడాన్ని అలుసుగా తీసుకుంటే సహించబోమని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. కోస్తా శాసనసభ్యులు మంత్రివర్గ నిర్ణయాన్ని వ్యతిరేకించడంపై తెలంగాణ శాసనసభ్యులు కొందరు ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డికి ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌ను ఆరవ జోన్‌ కిందికి తేవడాన్ని వ్యతిరేకించాలనే కోస్తా కాంగ్రెస్‌ శాసనసభ్యులు భావిస్తున్నారు. రెండు ప్రాంతాల మధ్య గిర్‌గ్లానీ కమీషన్‌ నివేదిక అమలు చిచ్చురేపే ప్రమాదం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X