• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హైదరాబాద్‌పై వారికి పరాభవం తప్పదు: తెరాస

By Staff
|
హైదరాబాద్‌: హైదరాబాద్‌ను ష్త్రీజోన్‌గా ప్రకటించాలని అంటున్నవారికి పరాభవం తప్పదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డి అన్నారు. హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటించాలని కోస్తా కాంగ్రెస్‌ నాయకులు వాదిస్తున్న నేపథ్యంలో నాయని నరసింహారెడ్డి బుధవారం మీడియా ప్రతినిధుల వద్ద ఆ విధంగా అన్నారు. హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటించాలనడం రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని ఆయన అన్నారు. హైదరాబాద్‌ను ష్త్రీజోన్‌గా ప్రకటింపజేయడానికి చేసే ప్రయత్నాలను తిప్పి కొడతామని, హైదరాబాద్‌లో పెద్ద యెత్తున ఉద్యమం లేస్తుందని ఆయన అన్నారు.

గిర్‌గ్లానీ కమీషన్‌ నివేదికను యధాతథంగా అమలు చేసి ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆయన కోరారు. 610 జీవో ప్రకారం తెలంగాణ స్థానికులకు 58 వేల ఉద్యోగాలు రావాల్సి వుండిందని, గిర్‌గ్లానీ కమీషన్‌ నివేదిక ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు రావాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా మేల్కొని గిర్‌గ్లానీ కమీషన్‌ నివేదికను అమలు చేయాలని నిర్ణయం తీసుకుందని, ఇటువంటి స్థితిలో దానికి వక్రభాష్యం చెప్పి అడ్డుకోవడానికి చూడడం మంచిది కాదని ఆయన అన్నారు. గిర్‌గ్లానీ కమిషన్‌ నివేదికను యధాతథంగా అమలు చేయకపోతే పెద్ద యెత్తున ఉద్యమం తీస్తామని ఆయన చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more