వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌ ఆరవజోన్‌ అయితే రాజీనామా: గాదె

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఆరవ జోన్‌ కిందికి రాదని సీనియర్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి వాదిస్తున్నారు. హైదరాబాద్‌ అనేది ఒక ప్రత్యేకమైన జోన్‌ అని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల వద్ద చెప్పారు. హైదరాబాద్‌ ఆరవ జోన్‌ కిందికి వస్తుందని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఎక్కడా లేదని ఆయన అంటున్నారు. హైదరాబాద్‌ ఆరవ జోన్‌ కిందికి వస్తుందని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఉంటే తాను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్‌ చేశారు.

అయితే గాదె వెంకటరెడ్డి వాదనను సిపియం శాసనసభా పక్షం నాయకుడు నోముల నరసింహయ్య ఖండిస్తున్నారు. హైదరాబాద్‌ కచ్చితంగా ఆరవ జోన్‌ కిందికే వస్తుందని ఆయన అన్నారు. హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటించాలనే డిమాండ్‌ను ఆయన ఖండించారు. 610 జీవోపై కాంగ్రెస్‌లోని వారే తలో మాట మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. 610 జీవోను యధాతధంగా అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని, అటువంటప్పుడు అధికార పక్షమైన కాంగ్రెస్‌లోని శాసనసభ్యులు దానితో విభేదించడం మంచిది కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X