వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వంటగ్యాస్‌ ధర ఇప్పుడే పెరగదు: దేవరా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వంటగ్యాస్‌ ధరను పెంచే యోచన లేదని పెట్రోలియం ఉత్పత్తుల శాఖ మంత్రి మురళీ దేవరా స్పష్టం చేశారు. బడ్జెట్‌లో వంట గ్యాస్‌ ధరలను పెంచే అవకాశాలున్నాయనే వార్తలను ఆయన గురువారం మీడియా ప్రతినిధుల వద్ద ఖండించారు. బడ్జెట్‌లో వంటగ్యాస్‌ ధరలను పెంచే ప్రతిపాదన ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు.

రంగరాజన్‌ కమిటీ సిఫార్సులపై బడ్జెట్‌ తర్వాతనే చర్చలు జరుగుతాయని, సిఫార్సులపై విస్తృతస్థాయి చర్చల తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. రంగరాజన్‌ కమిటీ సిఫార్సులపై విస్తృతస్థాయి చర్చ అవసరమని ఆయన అన్నారు. వంటగ్యాస్‌, కిరోసిన్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచాలని రంగరాజన్‌ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X