వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
610 జీవోను వెంటనే అమలు చేయాలి: పిజెఆర్
హైదరాబాద్: తెలంగాణ స్థానికులకు ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు జారీ అయిన 610 జీవోను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఎంతో కాలంగా తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్న 610 జీవోను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరమైన విషయమైన ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
గిర్గ్లానీ కమీషన్ నివేదిక అమలుపై, హైదరాబాద్‌పై వివిధ రాజకీయాలు తలో రకంగా ప్రకటనలు చేస్తూ అయోమయం సృష్టిస్తున్నాయని, దీని వల్ల ప్రజల్లో 610 జీవో అమలుపై అనుమానాలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. సమైక్యంగా ఉన్న ప్రజల మధ్య రాజకీయ నాయకుల ప్రకటనలు విభేదాలను సృష్టిస్తున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 610 జీవోను వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Story first published: Thursday, February 23, 2006, 23:53 [IST]