• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రైల్వే విస్తరణ పనులకు గండి ముప్పు: బాబు

By Staff
|

హైదరాబాద్‌/న్యూఢిల్లీ: రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రతిపాదించిన బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన నామమాత్రం కేటాయింపుల వల్ల విస్తరణ పనులు కుంటుపడే ప్రమాదం ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. రాష్ట్రంలోని పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులకు 5 వేల కోట్ల రూపాయలు అవసరం పడతాయని, అయితే వాటికి నామమాత్రం కేటాయింపులు మాత్రమే జరిగాయని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రయాణికులకు కొద్దిపాటి వెసులుబాటు కల్పించడం మినహా బడ్జెట్‌ వల్ల పెద్ద లాభమేమీ లేదని ఆయన అన్నారు.

గత రైల్వే బడ్జెట్‌లో కన్నా ప్రస్తుత రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడు ఢిల్లీలో అన్నారు. నాలుగు కొత్త రైళ్లను ఇచ్చినప్పటికీ ఒక ప్రధానమైన రైలును దారి మళ్లించడ ద్వారా అన్యాయం చేశారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. హైదరాబాద్‌లోని మల్టీ మోడల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ రెండో దశ ప్రస్తావన లేకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రైల్వే బడ్జెట్‌ను రైల్వేలను ప్రైవేట్‌ పరం చేసేందుకు వీలుగా ప్రతిపాదించారని సిపిఐ పార్లమెంటు సభ్యుడు సురవరం సుధాకర్‌ రెడ్డి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X