వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాదె అసెంబ్లీలో ఉండాలి: తెలంగాణ ఎమ్యెల్యేలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తమ పార్టీ సీనియర్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యుడు గాదె వెంకట రెడ్డి శాసనసభలో ఉండాలనే తాము కోరుకుంటున్నామని తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభ్యులు డి. శ్రీధరబాబు, జీవన్‌ రెడ్డి తదితరులు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ ఆరవ జోన్‌ కిందికి వస్తుందని తేలితే తాను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని గాదె వెంకటరెడ్డి చేసిన ప్రకటనపై వారు శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విధంగా అన్నారు.

గాదె వెంకటరెడ్డి తన ప్రకటనను ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని వారు సూచించారు. అన్నీ తెలిసే గాదె వెంకటరెడ్డి ఆ విధంగా మాట్లాడుతున్నారని వారన్నారు. హైదరాబాద్‌ను ప్రీజోన్‌గా ప్రకటించాలని వస్తున్న డిమాండ్‌ వెనక ముఖ్యమంత్రి వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి హస్తం ఉందనే ఆరోపణలను వారు ఖండించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X