వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ ఉపఎన్నికలో అక్రమాలు నిజమే: ఇసి ప్రతినిధులు

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖపట్నం- 1 నియోజకవర్గం ఉపఎన్నికలో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని ఎన్నికల కమిషన్‌ ప్రతినిధులు శనివారం ఇక్కడ నిర్ధారించారు. అధికార దుర్వినియోగం, డబ్బు పంపిణీ జరిగిందని, అయితే డబ్బు పుచ్చుకున్న ఓటర్లు సాక్ష్యమివ్వడానికి ముందుకు రావడం లేదని కేంద్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి తపస్‌ కుమార్‌ ఇక్కడి సర్క్యూట్‌ హౌస్‌లో విలేకరులకు తెలియజేశారు. దీనిపై సోమవారం ఎన్నికల ప్రధానాధికారికి నివేదిక ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు. కాగా ఈ ఉపఎన్నిక అక్రమాలపై తమ టీవీ ఛానల్‌ ప్రసారం చేసిన దృశ్యాలనే ఎన్నికల కమిషన్‌ సాక్ష్యాలుగా స్వీకరించిందని ఒక తెలుగు టీవీ ఛానల్‌ ప్రకటించుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X