బుష్ హైదరాబాద్ పర్యటన ఖరారు
అదే రోజు ఆయన ఐక్య ప్రగతిశీల కూటమి (యుపి) చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రతిపక్ష నాయకుడు ఎల్.కె. అద్వానీ, మాజీ ప్రధాని వి.పి. సింగ్లతో సమావేశమవుతారు. మతపెద్దలతో భేటీ అవుతారు. అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బందిని కలుసుకుంటారు. మర్నాడు మార్చి 3వ తేదీన హైదరాబాద్ వెళ్తారు. హైదరాబాద్లో ఆయన ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తారు. అంతర్జాతీయ బిజినెస్ స్కూల్లో పారిశ్రామికవేత్తలు, మేధావులతో సమావేశమవుతారు. హైదరాబాద్లో బుష్ శాస్త్రవేత్తలు నార్మన్ బోర్లాగ్, ఎం. ఎస్. స్వామినాథన్లతో సమావేశమవుతారు. సాయంత్రం తిరిగి ఢిల్లీ వెళ్లి పాకిస్థాన్ పర్యటనకు బయలుదేరి వెళ్తారు.
బుష్ భారత పర్యటనను వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దక్షిణాసియాలో పట్టు కోసమే బుష్ భారత్లో పర్యటిస్తున్నారని వామపక్షాలు విమర్శిస్తున్నాయి. అమెరికాతో భారత్ అణు ఒప్పందాన్ని కూడా వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!