• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మణుగూరులో ఇద్దరు నక్సల్స్‌ హతం

By Staff
|

ఖమ్మం: ఖమ్మం జిల్లా మణుగూరులో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. వీరు ఏ గ్రూప్‌నకు చెందినవారనేది ఇంకా తెలియరాలేదు. పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఇది జరిగిందని మణుగూరు డియస్సీ వరప్రసాద్‌ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని ఆపడానికి పోలీసులు ప్రయత్నించారని, అయితే ద్విచక్రవాహనం వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి దిగి పోలీసులపైకి కాల్పులు ప్రారంభించాడని, దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని ఆయన వివరించారు. కొద్దిసేపటికి కాల్పులు ఆగిపోవడంతో పోలీసులు పరిశీలన జరిపారని, ఇద్దరు మరణించిన విషయాన్ని తెలుసుకున్నారని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X