• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అసెంబ్లీ నుంచి టిడిపి సభ్యుల సస్పెన్షన్‌

By Staff
|

హైదరాబాద్‌: ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు మినహా తెలుగుదేశం సభ్యులందరినీ స్పీకర్‌ కె. ఆర్‌. సురేష్‌ రెడ్డి రెండు రోజుల పాటు శాసనసభ నుంచి సస్పెండ్‌ చేశారు. సస్పెండ్‌ చేస్తూ తీర్మానం ఆమోదించిన తర్వాత కూడా తెలుగుదేశం సభ్యులు బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్‌తో వారిని పంపించారు. విశాఖ - 1 ఉప ఎన్నికపై తక్షణ చర్చకు బుధవారం తెలుగుదేశం పార్టీ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది. అయితే దాన్ని స్పీకర్‌ తిరస్కరించారు. అయినా తెలుగుదేశం సభ్యులు పట్టు వీడలేదు. సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. దీంతో వారిని స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు.

సమావేశం హాల్‌ నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశం సభ్యులు శాసనసభా ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. విశాఖ -1 ఉప ఎన్నికలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని వారు విమర్శించారు. అందుకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేశారు. సమావేశం హాల్‌ చంద్రబాబు వెలుపలికి వచ్చి తమ పార్టీ శాసనసభ్యులతో పాటు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X