దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
  • search

అణు ఒప్పందం అమలుకు అంగీకారం

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    న్యూఢిల్లీ: పౌర అణు సహకార ఒప్పందం అమలుకు అమెరికా, భారత్‌లు అంగీకారానికి వచ్చాయి. పౌర సదుపాయాల గుర్తింపు పూర్తి చేసే కార్యక్రమం ప్రారంభమవుతుందని అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌తో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా ప్రతినిధుల సమావేశంలో భారత ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ చెప్పారు. ఇరువురు నేతలు ముఖాముఖి చర్చలు జరిపిన అనంతరం సంయుక్తంగా మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. భారత్‌ అణు కార్యకలాపాల గుర్తింపు ఒక కొల్కి వచ్చిందని ఆయన చెప్పారు.

    అమెరికా, భారత్‌ భాగస్వామ్యానికి పరిమితులే లేవని ఆయన అన్నారు. అణు ఒప్పందంపై ఇరువురం పరస్పరం సంతృప్తికరమైన అవగాహనకు వచ్చామని ఆయన చెప్పారు. భారత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విధానాలను రూపొందించాలని ఐఎఇఎను కోరుతామని ఆయన చెప్పారు. తీవ్రవాదాన్ని పెకిలించివేయాలన్న ఉభయ దేశాల నిర్ణయం ఎంతో ఆనందదాయకమైందని ఆయన అన్నారు.

    అమెరికా, భారత్‌లు తీవ్రవాదం సవాల్‌ను ఎదుర్కుంటున్నాయని, తీవ్రవాదంపై సంయుక్త పోరు సాగిస్తామని అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ అన్నారు. భారత ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌తో తన సమావేశం చారిత్రకమైందని ఆయన అన్నారు. పాకిస్థాన్‌ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌, భారత ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఎంతో సాహసంతో వ్యవహరిస్తున్న నేతలని ఆయన ప్రశంసించారు. భారత సరుకులకు అమెరికా పెద్ద మార్కెట్‌ అని ఆయన అన్నారు. వాణిజ్య, సాంస్కృతిక రంగాల్లో కూడా ఉభయ దేశాల మధ్య పరస్పర సహకారం వుంటుందని ఆయన చెప్పారు. వ్యవసాయంలో సంయుక్త పరిశోధనకు, అభివృద్ధికి కృషి జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రపంచం మారుతోందని, పరిస్థితులూ మారుతున్నాయని, అందుకు అనుగుణంగా విధానాలు కూడా మారాలని బుష్‌ అన్నారు.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more